ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు.
తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు నాని.