తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.