ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని మరోసారి స్పందించాడు. ‘వకీల్సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేది. ఈ సమస్యే మొదలయ్యేది కాదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకమత్యం లేదు.
సినిమా టికెట్ల రేట్లపై ఇదివరకు నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు. సమస్య అనేది నిజం. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.