చలికాలంలో చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.
1. తేనెలో అల్లం కలుపుకుని తాగాలి.
2. పావు స్పూన్ మిరియాల పొడిని తేనెలో కలిపి తరచూ తీసుకోవాలి.
3. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి.
4. వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి, కొద్దిగా చక్కెర వేసుకుని తాగాలి.
5. మిరియాలు, ధనియాలు కషాయంగా చేసుకుని తాగాలి.