ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటలు పాడారు.
వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాలను ఆలపించారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీలోని ‘పట్టుపట్టు చెయ్యే పట్టు’తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.