తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేసింది.
ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27, యాదాద్రిలో 23, భూపాలపల్లిలో 12 కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేశారు.