టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.