తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైరయ్యారు.
కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.