ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు కరోనా సోకింది. ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే వడివేలు లండన్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వడివేలు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
