దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
1961లో మలయాళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాను సేతుమాధవన్ డైరెక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.