ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గిఫ్ట్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు. మూడేళ్ళ తర్వాత పవన్ రీ ఎంట్రీ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించారు. ఇది ఆయనకి దర్శకుడిగా మూడవ సినిమా. గత చిత్రాలు భారీ సక్సెస్ కాకపోయినా మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు.
ఆ నమ్మకాన్ని వేణు నిలబెట్టుకున్నారు. బాలీవుడ్, కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సినిమాను మళ్ళీ తెలుగులో చేయడం అంటే పెద్ద రిస్కే. అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్..మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ అంటే అందరిలో ఉండే అంచనాలు వేరే లెవల్. ఆ అంచనాలను అందుకొని పవర్ స్టార్‌కు భారీ హిట్ ఇచ్చారు. అప్పటి నుంచి పవన్‌తో మంచి బాండింగ్ ఏర్పడింది.
కాగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా తన దర్శకుడికి గిఫ్ట్ పంపించి పవన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను ఓపెన్ చేసిన వేణు శ్రీరాం భార్య గాయత్రి శ్రీరాం సోషల్ మీడియాలో షేర్ చేసి.. పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వేణు శ్రీ రాం నెక్స్ట్ సినిమాగా ‘ఐకాన్’ రాబోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవల్లో స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మించనున్నారు.