తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది.
గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.