వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు తెలంగాణలో జరిగే మేడారం మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ 3845 బస్సులను నడపనుంది. సుమారుగా 21 లక్షల మంది భక్తులు జాతరకు వస్తారనే అంచనాలతో 2020లోనూ ఈ స్థాయిలోనే బస్సులు నడిపింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో 2250 బస్సులను ఈ రీజియన్ నుంచే నడపనుంది. జాతర సమయంలో మేడారం వద్ద బస్సులు నిలిపేందుకు 50 ఎకరాల్లో టీఎస్ఆర్టీసీ భారీ బస్టాండును నిర్మిస్తోంది.