ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది.
ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్, పేమెంట్ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు కనిపిస్తాయి. రైడ్ తనకు అంగీకారమైతే ప్రొసీడ్ కావొచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేర్పులపై క్యాబ్ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.