తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సర్కారు సిద్ధమైంది. అన్ని శాఖల్లో కలిపి 86 వేల ఖాళీలు ఉన్నట్లు తేలింది. వీటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోనూ ఏర్పడిన 55వేలకు పైగా ఉద్యోగాలను వరుస నోటిఫికేషన్లలో భర్తీ చేయాలనుకుంటోంది.
ఇక నుంచి ఖాళీలు ఏర్పడ్డ 6 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేసేలా ప్లాన్ చేస్తోంది.కాగా హోంశాఖలో 21507, విద్యాశాఖలో 22వేలు, వైద్యశాఖలో 10,048, BC సంక్షేమ శాఖలో 3,538 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది.