త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వీలుగా జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించింది.
జమ్మూలో 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు, బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలున్నాయి.