ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో రాత్రి పూట నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని గుజరాత్ సర్కారు పేర్కొంది.
రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా గుజరాత్లో తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 11కు పెరిగింది.