Tollywood Top Music Director దేవీశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
‘పుష్ప’ సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా చిత్రబృందంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఐటమ్ సాంగ్స్ ‘రింగ రింగా..’, ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ ఈ రెండు పాటలను భక్తి పాటలగా మార్చి పాడారు.
అంతటితో ఆగని ఆయన.. ఐటెం సాంగ్స్, దేవుళ్ల పాటలు తన దృష్టిలో ఒక్కటే అని చెప్పడం గమనార్హం. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాట పాడు కానీ హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పాడకూడదు.. ఇలా పాడటం హిందువులను కించపరుచినట్లే కదా.. ఇది ఎంతవరకు సబబు అని ఒకింత హెచ్చరిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.