తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
చాచా నెహ్రూనగర్‌లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 కిలోలీటర్ల నీటి సంపులను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి, కార్మొరేటర్లు పాల్గొన్నారు.