తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేశారు. శాసనసభలో అక్టోబర్ ఒకటిన సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈ మేరకు దీనిపై ఉత్తర్వులు విడుదలయ్యాయి. హరితనిధికి నోడల్‌శాఖగా అటవీశాఖ వ్యవహరించనున్నది. అటవీశాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి కమిటీని ఆ కమిటీ విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
హరిత నిధి రాష్ట్ర స్థాయి కమిటీ
చైర్పర్సన్: అటవీ, పర్యావరణశాఖ మంత్రి
వైస్ చైర్పర్సన్: అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
కన్వీనర్: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (హెచ్ఓఎఫ్ఎఫ్)
సభ్యులు: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్(ఎస్ఎఫ్), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్(కంపా), ఆర్థికశాఖ కార్యదర్శి, ఎండీ ఫారెస్ట్ కార్పొరేషన్ (అవసరం మేరకు మరికొందరిని కో ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవచ్చు.)