Home / MOVIES /  ప్ర‌పంచ‌సుంద‌రి పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ

 ప్ర‌పంచ‌సుంద‌రి పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ

 ప్ర‌పంచ‌సుంద‌రి పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ త‌గిలింది. మిస్ ఇండియా వ‌ర‌ల్డ్‌ మాన‌స వార‌ణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మిస్ వ‌ర‌ల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాప‌డ్డాయి. పోటీల నిర్వాహ‌కులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవ‌లం కొన్ని గంట‌ల ముందు ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం పోటీదారులంతా మిస్ వ‌ర‌ల్డ్ ఫినాలే జ‌రుగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

కంటెస్టెంట్ల‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించాం అని అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కంటెస్టెంట్లు, సిబ్బంది, ప్ర‌జ‌ల ఆరోగ్యం, భ‌ద్ర‌తను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో పోర్టారికో కొలీజియం జోస్ మిగ్వెల్ అగ్రెలాట్ ప్ర‌పంచ సుంద‌రి ఫినాలే పోటీలు ఎప్పుడ‌నేది రీషెడ్యూల్ చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

ప్ర‌పంచ సుంద‌రి పోటీదారులు, సిబ్బంది క‌లిపి మొత్తం 17 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో మిస్ ఇండియా వ‌ర‌ల్డ్ మాన‌స వార‌ణాసి కూడా ఉన్నారు. అమె 2020లో మిస్ ఇండియా వ‌ర‌ల్డ్ కిరీటం ద‌క్కించుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat