దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందట.