టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు.
ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.