ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించేలా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది.
నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 47 ఏళ్ల చెన్నై వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. మరోవైపు UKలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.ఇప్పటికే 10వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.