అరటిపండ్లు కవర్లో పెడితే పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయటకు తీసి విడివిడిగా ఉంచాలి.
ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి.
బంగాళదుంపలు చల్లని నీటిలో వేసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది.
కోడిగుడ్లు ఉడికించి తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల పెంకులన్నీ పగులుతాయి.