పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది.
ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.