దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 8 కేసులు వచ్చాయి. ఈ ఉదయం ఢిల్లీలో 4, రాజస్థాన్లో 4 కేసులు నమోదయ్యాయి.
దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.