సహాజంగా,కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు 3 నుంచి 5 వేల లీటర్ల నీరు వినియోగం అవుతోందని కేంద్రం తెలిపింది. అందుకే రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించింది.
రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వేరుశనగ, పప్పు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, తృణధాన్యాలు, ఉద్యానపంటలను సాగు చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంది.