శరీరంలో ఐరన్ లోపముంటే రక్తహీనత వస్తుంది. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు కింది పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
1. బచ్చలి కూర, పాలకూర
2. అలసందలు
3. బెల్లం
4. ఉసిరికాయ
5. నానబెట్టిన ఎండుద్రాక్ష