ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు.
‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.