ఇరాన్ నుంచి కివీ పండ్ల దిగుమతిని కేంద్రం నిషేధించింది. తెగుళ్లు సోకిన కివీ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశంలోకి వచ్చిన 22 సరుకుల్లో తెగులు ఉన్న పండ్లను గుర్తించినట్లు చెప్పారు. దీంతో కివీ పండ్లను పంపొద్దని ఇరాన్కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అయినా ఆ పండ్లు దిగుమతి అవుతుండటంతో నిషేధం విధించినట్లు తెలిపారు.
Tags doctor tips Health Tips Healthy healthy food kivi fruits kivis life style slider