ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు.
మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.