కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు.
తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
”నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలు మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ మధ్య నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై” అంటూ రాసుకొచ్చారు అర్జున్. ఒకప్పుడు హీరోగా అలరించిన అర్జున్ ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.