తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపితమైంది. ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊహాల్లో విహరిస్తున్నారు.
తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో శాసనమండలిలో మిత్రపక్షాలతో కలిసి టీఆర్ఎస్ బలం 39కి చేరింది. 36 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉండగా, ఇద్దరు ఎంఐఎం నుంచి, ఒకరు కాంగ్రెస్, మరొకరు స్వతంత్ర సభ్యుడు శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బీజేపీ ప్రాతినిథ్యం గుండు సున్నా. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ఇక శాసనసభ కూడా 95 శాతం టీఆర్ఎస్ చేతిలో ఉంది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ తగ్గలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తుందన్న నమ్మకం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.