Tollywood అందాల ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌లతో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార.
‘ది లిప్‌బామ్ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది.‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది.
అందుకే ఈ బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్ చెప్పుకొచ్చారు. కాగా గతంలో కత్రినా కైఫ్ కూడా ఇలాగే బ్యూటీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.