ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అతను అందుకున్నాడు. డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడంతో 34 ఏళ్ల నాథన్ లియన్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి.
ఆస్ట్రేలియా తరపున లియన్ 101వ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెటర్లలో లియన్ 16వ బౌలర్ కావడం విశేషం. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్లలో షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత ఆ జాబితాలో చేరాడు. అయితే నాథన్ అత్యుత్తమ ప్రదర్శన ఇండియాపై ఉంది.
2017లో బెంగుళూరులో జరిగిన టెస్టులో లియన్ 50 రన్స్ ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానల్లో షేన్ వార్న్ (708), ఇండ్లండ్ స్పీడ్ బౌలర్ జిమ్మీ అండర్సన్ (632), స్టువర్ట్ బ్రాడ్ (524) ఉన్నారు.