దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో ఒమైక్రాన్ వేరియెంట్ కేసు వెలుగుచూసింది.ఢిల్లీలో శనివారం ఒమైక్రాన్ వేరియంట్ రెండో కేసు నమోదైంది. ఢిల్లీలో ఒమైక్రాన్ మొదటి కేసు నమోదైందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.
ఈ వారం జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి నుంచి తీసుకున్న నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా ఒమైక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. రోగి ప్రయాణ చరిత్ర ప్రకారం అతను ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లాడు.ఒమైక్రాన్ రోగిని దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చేర్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో ఒమైక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.