తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి ఆరు జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు.