Home / MOVIES / దుమ్ము లేపోతున్న RRR ట్రైలర్

దుమ్ము లేపోతున్న RRR ట్రైలర్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రుధిరం. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ సినిమా జ‌న‌వరి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా మూవీ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో విజువ‌ల్స్ స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి.

చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నంగా ఆర్ఆర్ఆర్ సినిమాని తీసారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించారు. ఇద్దరికి సంబంధించిన విజువ‌ల్స్ అభిమానుల‌కి పూన‌కాలు తెప్పిస్తున్నాయి. భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.

ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ ట్రైలర్ లో హైలెట్ అని చెప్పొచ్చు. పులితో ఎన్టీఆర్ ముఖాముఖీ తలపడగా.. దాన్ని బంధించిన తీరుకు థియేటర్స్ దద్దరిల్లేలా చేసింది. అడవుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన పోరాటాలు… మరో లెవెల్ అని చెప్పాలి. ఇద్దరు మహావీరుల నిజ జీవిత పాత్రల ఆధారంగా అద్భుతమైన ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ అదరగొట్టారని ట్రైలర్ చూసి చెప్పొచ్చు.

ఈ 3.07 నిమిషాల ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ చూసి ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారని అర్థం అవుతోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి శైలి యాక్షన్ ఘట్టాలు , ఎలివేషన్ సీన్స్ , ఎమోషన్స్ గూస్ బమ్స్ తెప్పిస్తోంది. కీర‌వాణి బ్యాగ్రౌండ్ స్కోర్ , సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేశార‌నే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అలాగే అగ్రరాజ్యం అయిన అమెరికాలో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. అక్కడ ఉన్న మల్టీప్లెక్స్ లలో ఆర్ఆర్ఆర్ గ్రాండ్ రిలీజ్ కానుంది. యూఎస్ లో సినిమార్క్ కు దాదాపుగా 350 మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి. వాటిలో 288 సినిమార్క్ మల్టీ ప్లెక్స్ ల్లో వెయ్యికి పైగా స్క్రీన్స్ ల్లో మొదటి మూడు రోజులు ఆర్ఆర్ఆర్ ఆడనుంది తెలుస్తుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat