కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేశారు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్ర దశ ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఆందోళన పరిస్థితి తప్పదన్నారు. ఈ దశలో మరో సంక్షోభాన్ని అంచనా వేయలేమని, కానీ మహమ్మారికి చెందిన తీవ్ర దశ వచ్చే ఏడాది ముగియనున్నట్లు ఆయన తెలిపారు.
గేట్స్ నోట్స్ బ్లాగ్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కొన్ని ఏండ్లలో ప్రతి సీజన్‌లో కోవిడ్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. మోల్‌నుపిరావిర్ యాంటీవైరల్ మాత్రలతో కోవిడ్ తీవ్రత నుంచి బయటపడవచ్చు అని ఆయన అన్నారు.
ప్రమాదకరమైన వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందన్నారు. అయితే వ్యాక్సిన్ అసమానతలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.