కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు.
డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కొవిడ్ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలని నిపుణులు సూచించారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. బ్రిటన్లో కొత్తగా 45,691 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరింది. మరో 180 కరోనా మరణాలు రికార్డవగా.. మొత్తం సంఖ్య 1,45,826కు చేరింది. బ్రిటన్లో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున వారిలో దాదాపు 89శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. 81శాతం కంటే ఎక్కువ మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.