తెలంగాణలో సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.