సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న రాయల నాగేశ్వరరావు పై సోషల్ మీడియా వేదికగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
ఏనాడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని నాయకుల కు ఈనాడు పదవులు కట్టబెడుతున్నారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇలా సొంత పార్టీ నాయకులే తమ వారిపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కలకలం సృష్టిస్తున్నాయి.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేలకొండపల్లి మండలం లో వర్గాలను సృష్టించి కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తున్నారని ఇలా అయితే తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగబోమని చెపుతున్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో నడిపించే నాయకులు లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కార్యకర్తలు కూడా తాము పార్టీకి రాజీనామా చేస్తామని చెపుతుండటం తో రానున్న రోజుల్లో పాలేరు లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.