యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జట్టు కేవలం 147 రన్స్‌కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్, స్పీడ్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశాడు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే.. రోరీ బర్న్స్ క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. అయితే తొలి సెషన్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 59 రన్స్ చేసింది. ఆ తర్వాత సెకండ్ సెషన్‌లో కమ్మిన్స్ తన విశ్వరూపం ప్రదర్శించాడు.
బట్లర్ కొంత మేరకు ఆసీస్ బౌలర్లను ప్రతిఘటించినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. స్టార్క్, హేజల్‌వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. గ్రీన్ ఖాతాలో ఒక వికెట్ పడింది.