నిరుపేద విద్యార్థులపై ఎస్ ఫౌండేషన్ వారు మరోమారు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గుంటకండ్ల సునీతా జగదీష్ రెడ్డి. పెన్ పహడ్ మండలం లింగాల గ్రామనికి చెందిన దళిత నిరుపేద విద్యార్థులు, క్రీడాకారిణి రణపంగ గౌతమి, రణపంగు గాయత్రి లకు ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసి.. ఇరువురి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని భరోసా కలిపించారు.
ఈ సందర్బంగా సోమవారం వారి నివాసాలకు వెళ్లి ఎస్ ఫాండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, మంత్రి సతీమణి శ్రీమతి గుంటకండ్ల సునీతా జగదీష్ రెడ్డి గారు, మంత్రి తండ్రి గారు గుంటకండ్ల రామచంద్రా రెడ్డి గారు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో MPP నెమ్మది బిక్షం, మండల పార్టీ అధ్యక్షుడు యుగేందర్ రావు, S ఫౌండేషన్ సీఈఓ వీరన్న, తూముల ఇంద్రసేనా రావు తదితరులు పాల్గొన్నారు