చాలామంది ఆహారం తీసుకోగానే అది అరగడానికి నడుస్తుంటారు. అయితే, ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో.. తిన్న వెంటనే నడవడం సరికాదట.
భోజనం తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ శక్తిని వాడుతుంది. అందుకే ఆ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే పనులు ఏవీ చేయకూడదు. అలా చేయడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. తప్పనిసరైతే కాస్త నెమ్మదిగా నడవాలని చెబుతున్నారు నిపుణులు.