కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతా విస్తరించే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డా. మనీంద్ర అగర్వాల్ అన్నారు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెల లో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయన్నారు.
మరోవైపు వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమని, కరోనా నిబంధనలు పాటిస్తే బయటపడొచ్చన్నారు. కాగా దేశంలో 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.