సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న కాలేజీల్లో ఫెస్ట్ లు ఊపందుకున్నాయి. వీటిలో విద్యార్థులెవరూ కనీసం మాస్కులు ధరించకుండా పాల్గొనడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది.
ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో 280 మందికి కరోనా సోకగా.. తాజాగా కరీంనగర్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో 43 మంది వైరస్ బారిన పడ్డారు. అందుకే విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.