ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే, జుట్టు సమస్యలకు ఉసిరి చెక్ పెడుతుంది. కురులు తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా ఉండేందుకు పోషణనిస్తుంది.
ఇందుకోసం పరగడుపునే ఉసిరికాయలు తినాలి. నాన్-సీజన్లో ఎండబెట్టిన ఉసిరి, మురబ్బా తీసుకోవాలి. ఉసిరి పచ్చడి తిన్నా పోషకాలు అందుతాయి. ఇందులోని విటమిన్-C.. పొటాషియం, సోడియం, ఐరన్ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.