ప్రతి రోజూ పోవాల్సిన నిద్ర కంటే నిద్ర తగ్గినా, ఎక్కువ అయినా వీర్యకణాలపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువసేపు పడుకునే వారిలో వీర్యం క్వాలిటీ పడిపోవడం గుర్తించారట.
7-8 గంటల సేపు నిద్రపోయేవారిలో స్పెర్మ్ నాణ్యత బాగా ఉంటున్నట్లు తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల వీర్యకణాలు దెబ్బతింటున్నాయట. పడుకునే 2 గంటల ముందు భోజనం చేయాలని, ఫోన్లను వాడొద్దని చెబుతున్నారు.